గుజరాత్ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు జరుగనున్న 11వ ఏషియన్ అక్విటిక్ ఛాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీలకు భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ పోటీలు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఈ స్విమ్మింగ్ పోటీలు గుజరాత్ రాష్ట్రంలోనీ అహ్మదాబాద్ వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన స్విమ్మర్లు పాల్గొంటుండగా భారత దేశం తరపున మన జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక తలపడనున్నారు. ఈ విషయాన్ని సిమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ మోనాల్ చౌక్ షి ప్రకటించారు.