శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళతో పాటు ద్విచక్ర వాహనదారునికి చిన్నపాటి గాయాలయ్యాయి. అదే సమయంలో వెనుక నుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు ఇరువురిని సపర్యలు చేసి అక్కడ నుంచి పంపించారు.