యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ఉదయం విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు.