ఆయనది నిరుపేద కుటుంబం.. కుటుంబాన్ని పోషించేందుకు ఊరూరా ఐసులు అమ్ముకుంటూ వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఐస్ లు అమ్ముకోవడానికి వెళ్లి అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విధారక ఘటన విజయనగరం జిల్లా విజయనగరం మండలంలోని రీమా పేట సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము అనే 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు.