మా పెన్షన్ను అన్యాయంగా తొలగించారని వెంటనే పునరుద్ధరించాలని వృద్ధులు డిమాండ్ చేశారు. గుత్తి మండలంలో మొత్తం 530 పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పెన్షన్లు రద్దయిన లబ్ధిదారులు శనివారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో కాసేపు ఆందోళన చేపట్టారు. అధికారులతో వాగ్వాదం చేశారు.పెన్షన్లు పునరుద్ధరించాలని అధికారులను నిలదీశారు. తమ చేతిలో ఏమి లేదని అధికారులు చెప్పారు. పెన్షన్లు తొలగించడం అన్యాయమని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పునరుద్ధరించకపోతే ఆందోళన బాట పడతావని హెచ్చరించారు.