చేతబడి చేస్తుందనే అనుమానంతో భార్యపై భర్త, అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మపురంకు చెందిన లాస్య అనే వివాహిత మహిళ చేతబడి చేస్తుందనే అనుమానంతో గృహ నిర్బంధం చేసి భర్త వెంకట ముఖర్జీ దాడి చేశాడు. గాయపడ్డ లాస్య సర్వజన ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిలకలపూడి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.