కరీంనగర్ సైదాపూర్ మండలం వెన్నంపల్లి లో యూరియా కోసం శనివారం రాత్రి సమయంలో తీవ్ర ఉధృక్తత నెలకొంది. యూరియా వస్తుందని సమాచారం మేరకు వెన్నంపల్లి సొసైటీ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. రైతుల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తత కు దారితీసి సొసైటీ పై దాడి దాడి చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. రైతులు సొసైటీలోని ఫర్నిచర్ స్వల్పంగా ధ్వంసం ధ్వంసం చేశారు.యూరియా లోడ్ రావడం తో అమాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా సొసైటీ భవనంలో లోడు నే దించారు. చీకటి పడ్డా కూడా యూరియా ఇవ్వకపోవడంతో సైదాపూర్,హుస్నాబాద్ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు సముదాయించారు.