పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. GHMC స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరించడానికి కొంతమంది చెత్తను ప్లాస్టిక్ కవర్లలో నింపి రోడ్లపై, నాలాల పక్కన, పెద్ద వాగుల వద్ద పారేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంద్రేశం వెళ్లే మార్గంలో చెత్త పేరుకుపోవడం వల్ల సమస్యలు అధికమవుతున్నాయన్నారు.