ఈ నెల 27వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకొని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, పంచాయితీ, పోలీస్, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు కొరకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని, అనుమతి పొందిన గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడం జరుగుతుందని తెలిపారు.