మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల రామాలయం, శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడికి బుధవారం మధ్యాహ్నం డీసీపీ భాస్కర్ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణపతి విగ్రహాల ప్రతిష్ట, నిమజ్జనం, ఊరేగింపు సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కరెంటు, రోడ్డు ప్రమాదాలు, నీటిలో మునిగిపోయే ప్రమాదాలకు అవకాశాలు ఉన్నందున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ ప్రజలకు సూచించారు.