కడప నగరపాలక సంస్థ మొదటి నూతన మహిళా మేయర్ గా ముంతాజ్ బేగం బాధ్యతలను స్వీకరించారు. కమిషనర్ మనోజ్డ్డి దగ్గరుండి ఆమెతో సంతకం చేయించి బాధ్యతలు అప్పగించారు. నగరపాలక సంస్థ ఏర్పడిన 20 సంవత్సరాల కాలంలో మొదటిసారి మహిళకు మేయర్గా అవకాశం వచ్చిందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ను పలువురు సత్కరించారు.