సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపోలో డిపో మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి రాధిక జైస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 13న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి సివిల్ కేసులు,ట్రాఫిక్ చలాన్లు ఇతర పెండింగ్ కేసులో సత్వర పరిష్కారం జరుగుతుందని దీనివలన సమయం,డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉద్యోగులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర