బాన్సువాడ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బాన్సువాడ టౌన్ సిఐ యం. అశోక్ కోరారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమం సందర్భాలను పురస్కరించుకుని ఆదివారం నాడు టౌన్ సిఐ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి నిర్వాహకులకు పలు ముఖ్య సూచనలు చేశారు. భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలని, డీజేల వాడకం పూర్తిగా నిషేధం అని తెలిపారు.