అశ్వరావుపేట లో జర్నలిస్టుల పై అక్రమ అరెస్టులు ఖండిస్తూ జర్నలిస్ట్ లు రాస్తారోఖో శనివారం నిర్వహించారు.ఖమ్మం జిల్లా కొనిజర్ల లో యూరియా కష్టాలపై న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ సాంబశివరావు సహా మరో ఇద్దరు వీడియో గ్రాఫర్ ల పై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అక్కసుతో జర్నలిస్ట్ పై తప్పుడు కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలని చూస్తోందని, దీన్ని సహించేది లేదని మీడియా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు బే షరతుగా ఎత్తివేయాలని అశ్వరావుపేట జర్నలిస్టులు డిమాండ్ చేశారు