సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం సభ్యులకు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరాస్వామి గౌడ్ గుర్తింపు కార్డులను శనివారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.