నిజామాబాద్ నగరంలో శనివారం వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందు కోసం సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శోభయాత్రకు ఉపయోగించే రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. దుబ్బలోని మున్నూరు కాపు సంఘం నుంచి శోభయాత్ర ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయకులను ఈ రథం ద్వారానే ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక నగర్‌లో నిమజ్జనం చేస్తారు.