Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
చలో కావలి పేరిట వైసీపీ నేతల కాకాణి గోవర్ధన్ రెడ్డి, mlc చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు శుక్రవారం మాజీ mla ప్రతాప్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు అనుమతులు లేవంటూ ఆ పార్టీకి చెందిన నాయకులను కావలి పోలీసులు ఎక్కడికక్కడ అడుకుంటున్నారు. పట్టణంలోని స్థానిక బృందావనం వద్ద నుంచి ముసునూరు టోల్ గేట్ వరకు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.