ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించి, ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పేరిట సరిహద్దు దిమ్మలను నిర్మిస్తున్న నవయుగ కంపెనీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం పలువురు గిరిజన సంఘం నేతలతో కలిసి పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ కు ఫిర్యాదు చేశారు. గిరిజనుల భూములపై ఇతరులకు ఎలాంటి హక్కు లేదన్నారు.