కనిగిరి: సిపిఐ పార్టీ 28వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలులో ఈనెల 23వ తేదీన నిర్వహించు భారీ బహిరంగ సభ, ర్యాలీ కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు, కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి యాసిన్ పిలుపునిచ్చారు. కనిగిరిలోని సిపిఐ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ... పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. సిపిఐ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.