బాపట్ల జిల్లా కొల్లూరులో కలెక్టర్ వెంకట మురళి గురువారం పర్యటించారు. దోనేపూడి నుంచి పోతార్లంక వెళ్లే చిన్న రేవును పరిశీలించారు. చిన్న రేవును దాటి ప్రజలు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. వరదలకు మునిగిన వాణిజ్య పంటలను పరిశీలించారు. మండలంలోని రైతులందరూ పంటల గురించి వివరించారు. మునిగిన పంట పొలాలకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కలెక్టర్ వెంకట మురళిని కోరారు. పంట నష్ట పరిహారం నివేదికల తయారు చేసే ప్రభుత్వానికి పంపించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.