చిత్తూరు జిల్లా .పుంగనూరు మండలం సింగరిగుంట గ్రామానికి చెందిన దంపతులు బోయకొండ సుజాత . పుంగనూరు నుంచి సింగరిగుంట గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా రెడ్డివారి భావి వద్ద ద్విచక్ర వాహనం నుంచి సుజాత జారిపడి తలకు గాయమై అపస్మారక స్థితికి వెళ్ళింది. సుజాతను తిరుపతి రుయా ఆసుపత్రికి ప్రైవేట్ అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో రొంపిచర్ల వద్ద మృతి చెందింది. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.