రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల్లో జ్వరాలు ఉన్న ప్రజలు గ్రామం దాటి వెళ్లొద్దని రంపచోడవరం ADMHO డేవిడ్ అన్నారు. లాగరాయి గ్రామంలో మహిళ మృతిపై మాట్లాడారు. స్క్రబ్ టైఫాస్ పోజిటివ్ కారణంగా మరణించారని, లాగరాయి ఆసుపత్రిలో అన్ని రకాల మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జ్వర లక్షణాలు ఉన్నవారి వద్ద బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.