నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ కు వీకెండ్ ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో చదువుకుంటున్న పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్కు వచ్చి సాగర్ యొక్క అందాలను తిలకిస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. 26 గేట్ల నుండి జాలువారే ప్రవాహాన్ని చూసి మురిసిపోతున్నారు. ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లి వాటర్ ఫాల్స్ ను చూసే కంటే సమీపంలోని నాగార్జునసాగర్ గేటును చూస్తే సరిపోతుందని పలువురు పర్యాటకులు ఆదివారం సాయంత్రం తెలిపారు. నెల రోజుల నుండి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసి ఉండడంతో టీవీలలో వార్తలు చూసి సాగర్ సందర్శించి వెళ్తున్నామని పలువురు పర్యాటకులు తెలిపారు