అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శాంతి దామంలో వెలసిన శ్రీ సద్గురు ఎర్రితాత స్వామి ఆలయంలో శనివారం రాత్రి 8:30 గంటలకు పల్లకి ఉత్సవ సేవలను భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకాలు పుష్పాలంకరణ పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో సేవా కమిటీ సభ్యులతో కలిసి దాతలు నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాయలసీమ కన్వీనర్ ధనంజయ రాధా దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.