శక్తి యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని శక్తి టీమ్ మహిళా ఎస్.ఐ శాంతమ్మ పేర్కొన్నారు. శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి శనివారం కడప నగరంలోని సాయిబాబా హైస్కూల్, భాష్యం హైస్కూల్ లలో విద్యార్థులకు 'శక్తి' టీమ్ మహిళా ఎస్.ఐ శాంతమ్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు , చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల పై డయల్ 100,112, చైల్డ్ లైన్ 1098, గృహ హింస 181, మహిళ వేధింపులు 1091,సైబర్ టోల్ ఫ్రి 1930, సైబర్ మిత్ర, సంబంధిత పోలీసు వారికి తక్షణమే సంప్రదించి పోలీసు వారు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్.ఐ సూచించారు.