శనివారం మధ్యాహ్నం గద్వాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. డబల్ బెడ్ రూమ్ నా కొల్లాపూర్ నియోజక వర్గంలో కూడా ఇంతవరకు పంపిణీ చేయలేదని మీ అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు..