ఈనెల పదవ తారీకు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. శుక్రవారం మడకశిరలో తెలుగుదేశం పార్టీ నాయకులుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఈనెల 10న అనంతపురంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బిజెపి అధ్యక్షుడు మాధవ్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు