అశ్వారావుపేట మండల కేంద్రంలో కొమరం భీం ప్రాంగణం నందు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆదివాసి సంఘాల నాయకులు ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు..ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ లంబాడాలు ఎస్టీలు కాదని 1976 సంవత్సరంలో కేవలం విద్య కోసం మాత్రమే ఐదు సంవత్సరాల ప్రాతిపదికన కలపడం జరిగిందని, అంతేగాని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాదని అన్నారు.