సంగారెడ్డిలో రూ.186 కోట్ల వ్యయంతో నిర్మించిన మెడికల్ కళాశాలను మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనిపించే దేవుడు వైద్యుడు మాత్రమే అని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ద్వారా వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత దగ్గరగా వైద్యం చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు