ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఆదేశించారు. ఈ మేరకు జీవన్దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖాన్లలో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ సర్జరీలు జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు.