రాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా నేడు స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ చేపట్టడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని, స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.