వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులతో అభివ్రుద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విద్యార్థులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. గిరిజిన న్రుత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులు,జిల్లా బీజేపీ నేతలతో కలిసి పాఠశాలను సందర్శించిన బండి సంజయ్ అన్ని తరగతి గదులను పరిశీలించారు.విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల సమస్యలపై అధ్యాపకులు,విద్యార్థులతో ఆరా తీశారు. స్టేట్ గవర్నమెంట్ తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.