ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో పులుల సంచారం అత్యధికంగా పెరిగిపోవడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అర్ధవీడు, కంభం, గిద్దలూరు, రాచర్ల మండలాలలో పెద్ద పులులతోపాటు చిరుతపులోల సంచారం పెరిగిపోయింది. ఇటీవల గేదలు, ఆవులు, ఎద్దులపై పెద్దపులి చిరుత పులి దాడి చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లకుండా పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీ శాఖ అధికారులు ఆదివారం హెచ్చరించారు. పులుల సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.