నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ముందు శనివారం మధ్యాహ్నం ఎస్ఐ అజ్మీరా రమేష్ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా సెలవుల్లో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలకు కష్టపడే తత్వాన్ని నేర్పించాలని తల్లిదండ్రులకు ఎస్ఐ రమేష్ సూచించారు.