తాంసి మండలంలోని ఆత్నంగూడను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని పురవీధుల గుండా డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీ తీశారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆడ్డీ బొజా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనగా వారిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డిసిసిబి చైర్మన్ బోజా రెడ్డి పేర్కొన్నారు.