సంచార విముక్త జాతుల దినోత్సవం జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఓడ్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవార్ కైలాష్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఆదివారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నెల 10న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించే సంచార విముక్త జాతుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో ఒడ్ కులస్తులు సంజు, నాగోరావు, తిరుపతి, శేఖర్, ఆకాశ్, గణేష్, రాజు, సుభాష్ పాల్గొన్నారు.