కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందువల్ల కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువుల్లో వచ్చి చేరిన వర్షపు నీటిని వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ తరపున పెండింగ్లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకుని, పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.