కామారెడ్డి : ఎలాంటి అంచనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తో కలిసి గణేష్ నిమజ్జనం నిర్వహించనున్న టేక్రియాల్ చెరువును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణమును అనుకొని ఉన్న టేక్రియల్ చెరువులో గణేష్ నిమజ్జనం సందర్భంగా దాదాపు 700 లకు పైగా గణేషులను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నదని ఆ రద్దిని దృష్టిలో పెట్టుకొని గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆపస్థితి కలవకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి.