తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో హోలీ క్రాస్ జంక్షన్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో ఏవో రవికుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ, ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్, సబ్సిడీ, మద్దతు ధరలు అందించకపోవడం వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల