జీవో నెంబర్ 99 ని సవరించి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం ఉన్నట్లు జాతీయ మాల మానాడు మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ రామస్వామి తెలిపారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఆదివారం మధ్యాహ్నం 3గంటలకి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలల జీవితాలను దెబ్బతీసిన జీవో నెంబర్ 99 కి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని, జీవోను రద్దు చేయాలని కోరుతూ, మాలలు అధిక సంఖ్యలో క్యాంప్ కార్యాలయం ముట్టడి లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు