మహబూబాబాద్ జిల్లా న్యాయస్థానంలో జిల్లాలో ఫోక్సో కేసుల నమోదు, విచారణ తదితరాంశాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ శనివారం మధ్యాహ్నం 3:00 లకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లైంగిక అఘాయిత్యం మైనర్ బాలుడి పట్ల జరిగిన కూడా అది ఫోక్సో చట్టం కిందకు వస్తుందన్నారు. 18 సంవత్సరాల లోపు వయసున్న బాల బాలికల పట్ల జరిగిన లైంగిక నేరాలన్నీ కూడా ఫోక్సో చట్ట పరిధిలోకి వస్తుందన్నారు. ఫోక్సో కేసులో బాధితులకు చట్టం నిర్దేశించిన ప్రమాణలా మేరకు బాధిత నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు