సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పీహెచ్సీ సిబ్బంది శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కుండీల్లో, వాటర్ ట్యాంకుల్లో, కొబ్బరి చిప్పల్లో, టైర్లలో నీటి నిల్వ వల్ల దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు ఇంటి పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని వాటి వల్ల దోమలు కార్చి రోగాల బారిన పడతామని పర్యావరణం పరిశుభ్రత లో భాగంగా అన్ని నీట్ గా ఉంచుకోవాలని తెలియజేశారు.