ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో సీపీఎస్ విద్రోహక దినం పారించరు.మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు . అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, గత 21 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు చేశారు.