రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురువారం ప్రశాంత వాతావరణంలో రాజన్న గుడి చెరువులో వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మీడియాకు తెలిపారు. సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మున్సిపల్,రెవెన్యూ హెల్త్, ఫైర్ సేఫ్టీ,అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన వేడుకలను ఎస్పీ మహేష్ బి.గీతే,ASP శేషాద్రిని రెడ్డిలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మండపాల నుంచి నిమజ్జనానికి భారీ గణనాథలు తరలివస్తున్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు భారీగా గుడి చెరువు వద్దకు ప్రజలు చేరుకుంటున్నారు.