అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు సోమవారం నాడు నగరంలోని గాంధీచౌక్లో పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే వస్తువులపై భారీ పన్ను ఊరట కల్పించడం హర్షణీయమన్నారు. వ్యాపార రంగాలకు మోదీ సర్కార్ దీపావళి కానుక ప్రకటించిందన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతో పాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని అన్నారు.