ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళుతున్న బైకును గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శ్రీను అనే వ్యక్తి ఎక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.