పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట జాతీయ స్థాయిలో పెన్షనర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏపీఆర్పిఏ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సుమారు 25 మందితో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ఈపీఎఫ్ నందు 8 కోట్ల మంది పెన్షనర్లు ఉన్నారని అందులో కేవలం ఒక కోటి మందికి కూడా పెన్షన్ ఇవ్వలేని స్థితిలో కేంద్రం ఉన్నదని మరియు ఈపీఎఫ్ కేంద్ర సంస్థ నందు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్ మొత్తం ఉన్నదన్నారు.