కనిగిరి: అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను మంజూరు చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి గిరిజన కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్ చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... నూతన పెన్షన్ల కోసం ఎంతోమంది సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉన్నారని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నూతనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు