కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చాపలు పట్టెందుకు వెళ్లిన వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు శుక్రవారం తెలిపారు. అబ్దుల్ రహీం (20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, నిన్నటి నుండి వెతుకుతున్నామని, లోయర్ మానేరు జలాశయం సమీపంలో ఉండడంతో ఆ నీటిలోకి కొట్టుక పోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తారు. రెస్క్యూ టీం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.