మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు కత్తులను తప్పుతూ యువకుడి పై దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా ఆదివారం ఉదయం 11:00 లకు వెలుగులోకి వచ్చింది. యువకుడి పై దాడి యత్నం సమయంలో కొందరు గుమ్మడూరు వాసులు అతన్ని రక్షించి కారులో ఉన్న వారిపై తిరగబడడంతో డ్రైవర్ మరికొందరు పరరయ్యారు.ఒకరు చిక్కడంతో అతని నిలదీస్తూ కత్తిని కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం కలకలం రేపుతుంది.. ఈ విషయంపై సీఐ మాట్లాడుతూ.. ఒక మహిళ విషయంలో ఇరువురు వ్యక్తుల మధ్య గొడవకు కారణమన్నారు. వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తితో పాటు డ్రైవర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.